Most Eligible Bachelor : అఖిల్ పూజా హెగ్డేల మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లో..

Most Eligible Bachelor : అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 24, 2020, 7:07 AM IST
Most Eligible Bachelor : అఖిల్ పూజా హెగ్డేల మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లో..
పూజా హెగ్డే,అఖిల్ Photo : Twitter
  • Share this:
Most Eligible Bachelor : అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా జరిగిన లాస్ట్ షెడ్యూల్‌లో చిత్రబృందం ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు అఖిల్, పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్‌ను కూడా షూట్ చేసింది. అయితే ఈ లవ్ సీన్స్ చాలా బాగావచ్చాయట. అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్.



 





View this post on Instagram




 

Here goes the first of the seven steps of #MostEligibleBachelor. See you at the theatres this April #MEB #AlluAravind @hegdepooja #BommarilluBhaskar @gopisundar__official #PradeeshMVarma #BunnyVas #VasuVarma @ga2official


A post shared by Akhil Akkineni (@akkineniakhil) on





పూజా వరుసగా హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది పూజా హెగ్డే.  ఆమె తాజా సినిమా అల వైకుంఠపురములో అదిరిపోయే హిట్ అయ్యింది. ఆమె క్రేజ్‌తో పాటు వరుసగా ప్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకుని మంచి కథ అనుకున్న తర్వాతే అఖిల్‌ ఈ సినిమాకు ఓకే చేశాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో మెండుగానే ఉండడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రకరించాడట. సినిమా చివరి దశ పనుల్లో ఉండటంతో ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌లో అఖిల్ లుక్ కొత్తగా వుంది. అఖిల్ విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లుక్ ఆసక్తి రేపుతోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.


First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు