• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AKHIL AKKINENI WILL WORK WITH AJAY BHUPATHI UNDER MYTHRI MOVIE MAKERS PRODUCTION AFTER SURENDER REDDY AGENT MOVIE TA

Akhil Akkineni: వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్న అఖిల్.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో అక్కినేని వారసుడు ..?

Akhil Akkineni: వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్న అఖిల్.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో అక్కినేని వారసుడు ..?

అఖిల్ అక్కినేని (Akhil Akkineni)

Akhil Akkineni : అక్కినేని మూడు తరం నట వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ’ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో క్రేజీ డైరెక్టర్‌తో నెక్ట్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    Akhil Akkineni : అక్కినేని మూడు తరం నట వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే  కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 19న విడుదలకానుంది. అది అలా ఉంటే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏజెంట్ అంటూ ప్రకటించిన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మే 2 నుంచి గోవాలో జరుగనుంది. ఈ సినిమా కోసం ఇండియాలో పలు లోకేషన్స్‌లలో షూట్ చేయనున్నారు. అంతేకాకుండా విదేశాలలో కూడా పలు చోట్ల షూటింగ్ పూర్తి చేయాలనేది చిత్ర యూనిట్ ప్రణాళిక. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.

    ఇక అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అఖిల్ ‘ఏజెంట్’ లుక్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ లుక్‌లో అఖిల్ అదరగొట్టాడనే చెప్పోచ్చు. చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ స్టైలీష్‌గా ఉన్నాడు. ఈ ఫస్టు‌లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. . ఈ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నాడు. థమన్ గతంలో అఖిల్ మిస్టర్ మజ్ను కోసం సంగీతం సమకూర్చాడు.ఈ సినిమాతో పాటు అఖిల్  అక్కినేని ‘RX 100’ వంటి డిఫరెంట్ మూవీతో అదరగొట్టిన అజయ్ భూపతి దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

    Akhil Akkineni Will Work With Ajay Bhupathi Under Mythri Movie Makers Production after Surender Reddy Agent Movie,Akhil Akkineni: వరుస ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్న అఖిల్.. తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో అక్కినేని వారసుడు ..?,Akhil Akkineni,Ajay Bhupathi,Akhil Akkineni Ajay Bhupathi,Akhil Akkineni, akhil surender reddy agent first look, Akhil akkineni Surender reddy new movie, Akhil Akkineni, Akhil Akkineni latest film, surender reddy, Bommarillu Bhaskar, most eligible bachelor, akhil akkineni new movie, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌,most eligible bachelor,అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌, tollywood news,అజయ్ భూపతి అక్కినేని అఖిల్,అక్కినేని అఖిల్,అజయ్ భూపతి
    అఖిల్, అజయ్ భూపతి (Twitter/Photo)


    ఇప్పటికే అజయ్ భూపతి.. అఖిల్‌తో పాటు నాగార్జునను కలిసి ఈ సినిమా స్టోరీని వినిపించాడట. ఈ స్టోరీ డిఫరెంట్‌గా ఉండటంతో నాగార్జునతో పాటు అఖిల్ కూడా ఈ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాను టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూకుడు మీదున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలున్నాయి. త్వరలో  ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం అజయ్ భూపతి.. శర్వానంద్, సిద్ధార్థ్‌లతో ‘మహా సముద్రం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు అఖిల్.. సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరు ఆయా ప్రాజెక్ట్‌లను కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు