Akhil Akkineni : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని హీరో.. క్రేజీ కథతో..

Akhil Akkineni : అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు అఖిల్‌కు ఇంతవరకు సాలిడ్ హిట్ పడలేదు.

news18-telugu
Updated: August 11, 2020, 3:05 PM IST
Akhil Akkineni : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని హీరో.. క్రేజీ కథతో..
అఖిల్ Photo : Twitter
  • Share this:
Akhil Akkineni : అదిరిపోయే బ్యాగ్రౌండ్‌తో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు అఖిల్‌కు ఇంతవరకు సాలిడ్ హిట్ పడలేదు. మొదటి సినిమా అఖిల్‌తోనే పెద్ద డిజాస్టర్‌ను మూటగట్టుకున్న అఖిల్.. ఇక అప్పటి నుండి సరైనా హిట్ కోసం ఆరాటపడుతూనే ఉన్నాడు. మొదట్లో మాస్ కథల్నీ ఎంచుకుని తప్పుచేశాడు. ఇక ఆ తర్వాత వాటిని వదిలీ ప్రేమ కథలను ఎంచుకున్న కూడా ఆయనకు అదృష్టం కలిసిరావట్లేదు అఖిల్‌కు. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో అఖిల్ సరసన వరుస విజయాలతో టాలీవుడ్‌లో యమ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. మరోవైపు అఖిల్ తండ్రి నాగార్జున కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. కొడుక్కు ఓ మాంచి హిట్ అందించాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా చూసిన నాగార్జున సినిమా అవుట్ పుట్ పట్ల సంతోషంగా ఉన్నాడట.

Akkineni akhil news, urender reddy ,Akkineni akhil next, mithran films, Akkineni akhil movies, Akhil Akkineni and Bommarillu Bhaskar movie eligible bachelor first look,Akhil Akkineni and Bommarillu Bhaskar movie titles as most eligible bachelor,akhil akkineni,bommarillu bhaskar,akhil akkineni new movie,akhil new movie,akhil bommarillu bhaskar movie,akkineni akhil,akkineni akhil new movie launch,akhil akkineni movies,akhil,akhil bommarillu bhaskar movie updates,akkineni akhil new movie,director bommarillu bhaskar,akhil akkineni new movie teaeer,akhil akkineni movie,akhil akkineni new movie opening,akhil bommarillu bhaskar,bommarillu bhaskar new movie,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌,most eligible bachelor,అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్‌
అఖిల్, పూజా హెగ్డే Twitter


ఇక ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సమ్మర్ రిలీజ్ అవ్వాలి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తమిళ దర్శకుడు మిత్రన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. విశాల్ హీరోగా అభిమన్యుడుతో సత్తా చాటిన డైరక్టర్ మిత్రన్ అఖిల్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందట. అంత కొత్తగా ఉండడంతో అఖిల్ కొంత ఆలోచనలో పడ్డాడట.  ఇక లేటెస్ట్ సమాచారం మేరకు అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అఖిల్ కోసం సురేందర్ రెడ్డి.. ఓ క్రేజీ స్టోరిని సిద్దం చేశాడట. ఇక సురేందర్ రెడ్డి లేటేస్ట్ సినిమా సైరా.. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదనిపించింది. చూడాలి మరి సురేందర్ రెడ్డి అయినా అఖిల్‌కు సాలిడ్ హిట్ ఇస్తాడో లేదో..
Published by: Suresh Rachamalla
First published: August 11, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading