అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. అయితే ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే ప్రస్తుత కరోనా సమయంలో ఈ సినిమా అనుకున్న తేదిలో విడుదల కావడం అసాధ్యంగా మారింది. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌కు అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చిందని.. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందని పుకార్లు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎంత మాత్రమూ నిజం లేదని.. కరోనా పరిస్థితులు కుదుట పడ్డాక, థియేటర్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
ఇక అది అలా ఉంటే అఖిల్ మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్ పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Tollywood news