Akhil Akkineni : క్రేజీ కథతో వస్తోన్న అఖిల్.. గట్టిగా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి...

Akhil Akkineni : అఖిల్ తన ఐదవ సినిమాను స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది.

news18-telugu
Updated: September 10, 2020, 2:22 PM IST
Akhil Akkineni : క్రేజీ కథతో వస్తోన్న అఖిల్.. గట్టిగా ప్లాన్ చేసిన సురేందర్ రెడ్డి...
అఖిల్, సురేందర్ రెడ్డి Photo : Twitter
  • Share this:
వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చేస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. పూజా వరుసగా హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.  ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రకరించాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.


ఇక ఆ సినిమా అలా ఉండగానే అఖిల్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. స్టైలీష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉండనుందని తాజాగా ప్రకటించాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. అఖిల్ ఇప్పటి వరకు తీసిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద మంచి అంచనాలు ఎప్పటికప్పుడు భారీగా నెలకొనడం అతనికి కెరీర్ కు ప్లస్ పాయింట్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమానే చెయ్యనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. అఖిత్‌తో ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నాడట సురేందర్ రెడ్డి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం.
Published by: Suresh Rachamalla
First published: September 10, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading