Home /News /movies /

AKHIL AKKINENI SURENDER REDDY AGENT UPDATE RELEASE DATE CONFIRMED HERE ARE THE DETAILS SR

Akhil Akkineni : అక్కినేని అఖిల్ ఏజెంట్‌ విడుదలకు డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Akhil Akkineni Surender reddy agent Photo : Twitter

Akhil Akkineni Surender reddy agent Photo : Twitter

Akhil Akkineni : అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తర్వాత నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ నేడు ప్రకటించింది టీమ్. ఏజెంట్ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది టీమ్.

ఇంకా చదవండి ...
    అఖిల్ అక్కినేని (Akhil Akkineni ) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Most Eligible Bachelor) తర్వాత నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ నేడు ప్రకటించింది టీమ్. ఏజెంట్ (Agent) చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది టీమ్. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి (Surender reddy) నిర్మిస్తున్నారు. ఏజెంట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో దర్శనమివ్వనున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా స్కేల్ మీద తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం ఏమంటే అఖిల్ (Akhil Akkineni)  ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటున్న‌ట్లు టాక్ నడుస్తోంది.

    ఇక అఖిల్ ఈ (Agent) చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సంగీతం ఎస్ఎస్ థ‌మ‌న్ అందిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. యూరప్‌లోని హంగేరీలో రాజధాని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ చేసింది టీమ్. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షితో పాటు అతుల్య రవి కూడా మరో హీరోయిన్‌గా చేస్తున్నారు.


    ఇక ఆయన గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor)  విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ములేపింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Agent Movie, Akhil Akkineni, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు