హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : కృష్ణపట్నం పోర్ట్‌లో అఖిల్ అక్కినేని ఏజెంట్ షూటింగ్...

Akhil Akkineni : కృష్ణపట్నం పోర్ట్‌లో అఖిల్ అక్కినేని ఏజెంట్ షూటింగ్...

Akhil Agent First look Photo : Twitter

Akhil Agent First look Photo : Twitter

Akhil Akkineni : అక్కినేని అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే.

  Akhil Akkineni : అక్కినేని అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. "ఏజెంట్" మూవీ షూటింగ్ త్వరలో పునః ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి పెద్ద ఎత్తున్న ప్లాన్ చేశారు. ఇప్పటికే అక్కడ కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు చిత్రబృందం. ఈ షెడ్యూల్ అనంతరం హైదరాబాద్‌లో మరో కీలక షెడ్యూల్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగా దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ గతంలో అఖిల్ మిస్టర్ మజ్ను కోసం సంగీతం సమకూర్చారు.


  ఇక అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా థియేటర్స్‌లో విడుకానుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akhil Akkineni, Tollywood news

  ఉత్తమ కథలు