హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌..

Akhil Akkineni : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌..

Most Eligible Bachelor Photo : Twitter

Most Eligible Bachelor Photo : Twitter

Akhil Akkineni : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలై టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇంకా చదవండి ...

  అఖిల్ అక్కినేని (Akhil Akkineni)ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేస్తున్నామని తెలిపారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటి వరకు 5 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకోని అదరగొడుతోంది.

  వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

  Suriya : అమెజాన్ ప్రైమ్‌లో సూర్య జై భీమ్.. నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్..

  సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో, చాలా సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించి, ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

  ఇక ఈ సినిమాతో పాటు అఖిల్ మరోవైపు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Tollywood news

  ఉత్తమ కథలు