హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..

Akhil Akkineni Pooja Hegde Photo : Twitter

Akhil Akkineni Pooja Hegde Photo : Twitter

Akhil Akkineni : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించడంతో.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు..

ఇంకా చదవండి ...

  అఖిల్ అక్కినేని (Akhil Akkineni)ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేస్తున్నామని తెలిపారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 30వ తేది సాయంత్రం 06:10 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.

  వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా పడగా.. ఇటీవల మరోసారి విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించింది.

  సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో, చాలా సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించి, ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

  Javed Akhtar: జావేద్ అక్తర్‌కు థానే కోర్టు షోకాజ్ నోటీసు.. ఆర్ఎస్ఎస్‌ను తాలిబన్‌లతో పోల్చిన వ్యవహారంలో సమన్లు

  దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. అక్టోబర్ 8న వైష్ణవ్ తేజ్ కొండపొలం కూడా విడుదల కానుంది. దీంతో ఈ చిత్రాన్ని కొన్ని రోజులు వెనుకకు జరిపారు.

  ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

  Movies: పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా సినిమాల సందడి.. ఒకే తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్న హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ సినిమాలు ఇవే.. ?

  మరోవైపు అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Akhil Akkineni, Pooja Hegde, Tollywood news

  ఉత్తమ కథలు