అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న బ్యాచ్‌లర్ ఇక ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కానుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న అంటే రేపటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్ బాగుండాలని నమ్మే వ్యక్తి హర్షగా అఖిల్ అక్కినేని, స్టాండప్ కమెడియన్‌గా విభావరిగా పూజా హెగ్డే అదరగొట్టారు.
ఇక ఈ సినిమాను మరోసారి ఆహాలో చూడోచ్చని అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరి.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే...
It's just a day away ???
Get your popcorn ready!!!#MEBOnAha #MostEligibleBachelor #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official pic.twitter.com/6o1NXzUAuW
— ahavideoIN (@ahavideoIN) November 18, 2021
బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ డే అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్‌ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ నమోదు చేసింది.
అంతేకాదు వరల్డ్ వైడ్‌గాను అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంది. అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి $225K మార్క్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 6.8 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను టోటల్ వరల్డ్ వైడ్‌గా 18.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.
Nayanthara Birthday Celebrations : ప్రియుడి సమక్షంలో నయనతార బర్త్ డే సంబరాలు.. పిక్స్ వైరల్..
రూ.20.91 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.23.75 కోట్ల షేర్ ను సాధించింది. దాదాపు.2.75కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అఖిల్ కెరీర్ లోనే మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నిలిచింది.
అఖిల్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్ (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో సాక్షి వైద్య కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha OTT Platform, Akhil Akkineni, Most Eligible Bachelor, Pooja Hegde, Tollywood news