Akhil Akkineni : అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూడో రోజు రాక్ సాలిడ్ కలెక్షన్స్.. ఇది ఎవరు ఊహించనిదే..

Most Eligible Bachelor Photo : Twitter

Akhil Akkineni Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

  • Share this:
    అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...

    బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్స్ అంచనాలను మించి, బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. మొదటి వీకెండ్ కూడా అదిరిపోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది.


    ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే 4.03 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుని అదరగొట్టింది.

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ 3 రోజులకు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

    Nizam: 5.41Cr
    Ceeded: 2.94Cr
    UA: 1.67Cr
    East: 86L
    West: 70L
    Guntur: 1.03Cr
    Krishna: 80L
    Nellore: 61L
    AP-TG Total:- 14.02CR(23.70CR Gross)
    Ka+ROI: 1.12Cr
    OS – 2.10Cr
    Total WW: 17.24CR(29CR Gross)

    ఇక ఈ సినిమాను టోటల్ వరల్డ్ వైడ్‌గా 18.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మూడు రోజుల్లోనే 17. 24 కోట్లను వసూలు చేయడంతో.. ఇంకా 1.76 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

    ఇక అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published: