అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని.. 10 వ రోజు 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 38 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.
Rajinikanth: బస్ కండక్టర్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు రజనీకాంత్ నట ప్రస్థానం..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ 10 రోజుల కలెక్షన్స్…
Nizam: 7.35Cr
Ceeded: 3.90Cr
UA: 2.28Cr
East: 1.18Cr
West: 95L
Guntur: 1.34Cr
Krishna: 1.07Cr
Nellore: 80L
AP-TG Total:- 18.87CR(31.05CR Gross)
Ka+ROI: 1.45Cr
OS – 2.34Cr
Total WW: 22.66CR(38CR~ Gross)
10 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ఇవి..
ఇక ఈ సినిమాను 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ సినిమా ఓవరాల్ గా 10 రోజుల్లో 3.66 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్‌గా నిలిచింది.
Rashmi Gautam: పూల చీరలో ఒయ్యరాలు ఒలకబోసిన రష్మి గౌతమ్.. అదిరిన పిక్స్..
ఇక అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్ (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Tollywood news