హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni-PooJa Hegde : ఆకట్టుకుంటోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ టీజర్..

Akhil Akkineni-PooJa Hegde : ఆకట్టుకుంటోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ టీజర్..

 అఖిల్, పూజా హెగ్డే Photo : Twitter

అఖిల్, పూజా హెగ్డే Photo : Twitter

Akhil Akkineni Most Eligible Bachelor Teaser : అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది.

Akhil Akkineni : అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరోవైపు నాగార్జున కూడా తన కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్.

ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రికరించాడట. ఇక అది అలా ఉంటే తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' చిత్రబృందం దసరా కానుకగా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ఆసక్తికరంగానే ఉంది. అఖిల్, పూజా హెగ్డే తమ టైమింగ్‌తో అదరగొట్టారు. టీజర్‌ను బట్టి చూస్తే.. లవ్, ఫ్యామిలీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఉండనుంది. చూడాలి మరి అఖిల్ ఈ సినిమాతోనైనా హిట్ కొడుతాడో లేదో.

ఇక ఎప్పుడో పూర్తైపోవాల్సిన  ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో కొద్దిపాటి షూటింగ్ మిగిలిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు నార్మల్ కావడంతో ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే అది సంక్రాంతి రోజా లేకపోతే సంక్రాంతి ముందురోజా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, వెంకటేష్ నారప్ప, రవితేజ క్రాక్, నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ, రామ్ రెడ్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. దీనికి తోడు మరో భారీ చిత్రం కేజీయఫ్ చాప్టర్ 2 కూడా పండుగను టార్గెట్ చేసుకుని వస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఆ సినిమా అలా ఉండగానే అఖిల్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. స్టైలీష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉండనుందని తాజాగా ప్రకటించాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. అఖిల్ ఇప్పటి వరకు తీసిన మూడు చిత్రాలు కూడా వైఫల్యం చెందినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్టుల మీద మంచి అంచనాలు ఎప్పటికప్పుడు భారీగా నెలకొనడం అతనికి కెరీర్ కు ప్లస్ పాయింట్‌గా మారింది. అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమానే చెయ్యనున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

First published:

Tags: Akkineni akhil, Pooja Hegde, Tollywood news

ఉత్తమ కథలు