హోమ్ /వార్తలు /సినిమా /

Most Eligible Bachelor : టీవీలో అదరగొట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రేటింగ్ ఎంతంటే..

Most Eligible Bachelor : టీవీలో అదరగొట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రేటింగ్ ఎంతంటే..

Most Eligible Bachelor Photo : Twitter

Most Eligible Bachelor Photo : Twitter

Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15, 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. థియేటర్ రన్ పూర్తి తర్వాత బ్యాచ్‌లర్ ఆహాతో పాటు ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయ్యినవారు తమ ఇంట్లోనే టీవీల్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలని నమ్మే వ్యక్తి హర్షగా అఖిల్‌ అక్కినేని, స్టాండప్‌ కమెడియన్‌‌గా విభావరిగా పూజా హెగ్డే అదరగొట్టారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా స్టార్ మాలో ప్రసారం అయ్యింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అదిరిపోయే టీఆర్పీ వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌కు 9.31 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీంతో టీమ్ సంతోషంగా ఉంది.

ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరి.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌‌గా నిలిచింది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే... బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ డే అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 5.45 కోట్ల రేంజ్ లో షేర్‌ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ నమోదు చేసింది.

అంతేకాదు వరల్డ్ వైడ్‌గాను అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంది. అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి $225K మార్క్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 6.8 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుంది.  టోటల్ వరల్డ్ వైడ్‌గా 18.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 19 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.23.75 కోట్ల షేర్ ను సాధించింది.  అఖిల్ కెరీర్ లోనే మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నిలిచింది.

Pushpa | Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప మరో రికార్డ్.. వంద కోట్ల వ్యూస్‌తో సంచలనం..

అఖిల్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో సాక్షి వైద్య కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Most Eligible Bachelor, Tollywood news

ఉత్తమ కథలు