హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : అయ్యగారు అక్కడ కూడా అదరగొడుతున్నారు.. హాఫ్ మిలియన్ క్లబ్‌లో బ్యాచ్‌లర్..

Akhil Akkineni : అయ్యగారు అక్కడ కూడా అదరగొడుతున్నారు.. హాఫ్ మిలియన్ క్లబ్‌లో బ్యాచ్‌లర్..

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (most eligible bachelor)

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (most eligible bachelor)

Akhil Akkineni Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...

అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 5 వ రోజు హాలిడే కలిసి రావడంతో 1.31 కోట్ల షేర్‌ని అందుకుంటే 6వ రోజు మాత్రం 57 లక్షల రేంజ్ షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక ఓవర్సీస్ లో అమెరికాలో సినిమా హాఫ్ మిలియన్ మార్క్ ని అధిగమించి అక్కడ మంచి లాభాలను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పటికే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో ఇక వచ్చేవన్ని లాభాలే అంటున్నారు.

Akash Puri - Romantic : ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ మూవీ విడుదల తేది ఖరారు.. అఫీషియల్ ప్రకటన..

6 రోజులకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్…

Nizam: 6.86Cr

Ceeded: 3.64Cr

UA: 2.13Cr

East: 1.07Cr

West: 87L

Guntur: 1.23Cr

Krishna: 96L

Nellore: 73L

AP-TG Total:- 17.49CR(28.85CR Gross)

Ka+ROI: 1.24Cr

OS – 2.22Cr

Total WW: 20.95CR(34.9CR Gross)

ఈ సినిమాను 18.5 కోట్లకు అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి 6 రోజుల్లో సాధించి అదరగొట్టింది. అంతేకాదు ఈ సినిమా 1.95 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ నెల 25 నుంచి పునఃప్రారంభం..

ఇక అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

First published:

Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Pooja Hegde, Tollywood news