అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకం. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. మరోవైపు నాగార్జున కూడా తన కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా నాగార్జున లాక్ డౌన్‌తో వచ్చిన ఖాళీ సమయంలో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్‌లో ఉన్న సినిమా మొత్తాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశాడట. తన కొడుకు సినిమా చాలా బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యాడట. సినిమా మంచి విజయం సాధిస్తుందని గట్టినమ్మకంతో ఉన్నాడట నాగార్జున. ఇక మరోవైపు కరోనా దెబ్బకు ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
దీంతో ఇటీవల ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తారంటూ వార్తలొచ్చినప్పటికీ, వాటిలో నిజం లేదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. దీంతో సినిమాకు మరింత బజ్ రానుంది. ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.