Akhil Akkineni-PooJa Hegde : అఖిల్ అక్కినేని పూజాహెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Akhil Akkineni PooJa Hegde Most eligible bachelor release date Photo : Twitter

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’.

  • Share this:
    Akhil Akkineni : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’. ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సీ ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే మొన్నటి వరకు ఈ సినిమా విడుదలపై కొంత క్లారిటీ లేక అభిమానులు అందోళన చెందారు. కాగా తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదలకానుందో ప్రకటించింది చిత్రబృందం. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరోవైపు నాగార్జున కూడా తన కొడుక్కి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.

    ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రీకరించాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.



    ఇక ఆ సినిమా అలా ఉండగానే అఖిల్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. స్టైలీష్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కొత్త సినిమా ఉండనుందని తాజాగా ప్రకటించాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదలైంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: