హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : బ్యాచ్‌లర్ తొమ్మిది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడు కోట్ల లాభం..

Akhil Akkineni : బ్యాచ్‌లర్ తొమ్మిది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడు కోట్ల లాభం..

Akhil Akkineni Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...

    అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు.

    ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...

    F3 Movie : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన..

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుని.. ప్రాఫిట్ జోన్‌లో ఎంటర్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ 9వ రోజు ఈ సినిమా 32 లక్షల షేర్‌‌ను సాధించింది.

    9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్...

    Nizam: 7.17Cr

    Ceeded: 3.81Cr

    UA: 2.22Cr

    East: 1.14Cr

    West: 92L

    Guntur: 1.29Cr

    Krishna: 1.03Cr

    Nellore: 78L

    AP-TG Total:- 18.36CR(30.22CR Gross)

    Ka+ROI: 1.39Cr

    OS – 2.30Cr

    Total WW: 22.05CR(36.80C Gross)

    ఇదీ ఈ సినిమా మొత్తం 9 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా సాధించిన కలెక్షన్స్..

    ఇక ఈ సినిమాను 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా టోటల్ గా 9 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి 3.05 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్’గా మారింది.

    Kajal Aggarwal : కాజల్ కెరీర్‌లో మరో మైలు రాయి.. అక్కడ చందమామకు ఎదురులేదు..

    ఇక అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

    First published:

    Tags: Akhil Akkineni, Most Eligible Bachelor

    ఉత్తమ కథలు