హోమ్ /వార్తలు /సినిమా /

Most Eligible Bachelor : సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..

Most Eligible Bachelor : సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..

ఏపీ + తెలంగాణ: 18.80 కోట్లు షేర్ 
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.11 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 20.91 కోట్లు షేర్

ఏపీ + తెలంగాణ: 18.80 కోట్లు షేర్  రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.11 కోట్లు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 20.91 కోట్లు షేర్

Most Eligible Bachelor : సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ. అంతేకాదు సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ చేసారు.

  Most Eligible Bachelor : సెన్సార్ పూర్తి చేసుకున్న అఖిల్, పూజా హెగ్డేల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ. అంతేకాదు సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ చేసారు. ఈ సినిమాను అక్టోబర్ 15న దసరా కానుగా విడుదల చేయనున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా హీరోగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది.అటు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. మరోవైపు నాగార్జున కూడా తన కుమారుడికి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.

  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తన మునుపటి సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా తెరకెక్కించారు. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్.

  ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో చిత్రీకరించాడట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

  Puri Jagannadh Introduced Heroines: రేణు దేశాయ్, అనుష్క, అసిన్ సహా పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

  ఇక ఆ సినిమా అలా ఉండగానే అఖిల్.. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు.  వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటిస్తోన్న ‘బంగార్రాజు’లో అఖిల్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ పాత్ర ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  సినిమా సెన్సార్ విషయానికొస్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందనేది టాక్. ఖచ్చితంగా ఈ జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చే కథనే బొమ్మరిల్లు భాస్కర్ తీసుకున్నాడని సెన్సార్ సభ్యుల నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికి సెన్సార్ సభ్యుల నుంచి అయితే మంచి రివ్యూనే దక్కించుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాతో అఖిల్ హీరోగా మొదటి సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhil Akkineni, Allu aravind, Censor Board Film Certificate, Most Eligible Bachelor, Pooja Hegde

  ఉత్తమ కథలు