హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎనిమిది రోజుల కలెక్షన్స్.. 36 కోట్లతో సూపర్ హిట్ దిశగా..

Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎనిమిది రోజుల కలెక్షన్స్.. 36 కోట్లతో సూపర్ హిట్ దిశగా..

Most Eligible Bachelor Photo : Twitter

Most Eligible Bachelor Photo : Twitter

Akhil Akkineni Most Eligible Bachelor : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...

    అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందట. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుని.. ప్రాఫిట్ జోన్‌లో ఎంటర్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ 8 వ రోజు 19 లక్షల రేంజ్ షేర్ నే సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 36 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లు అయ్యింది.

    Happy Birthday Prabhas | Radhe Shyam Teaser : మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన రాధేశ్యామ్ టీజర్..

    8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్...

    Nizam: 7.07Cr

    Ceeded: 3.75Cr

    UA: 2.18Cr

    East: 1.11Cr

    West: 90L

    Guntur: 1.27Cr

    Krishna: 1.00Cr

    Nellore: 76L

    AP-TG Total:- 18.04CR(29.72CR Gross)

    Ka+ROI: 1.36Cr

    OS – 2.26Cr

    Total WW: 21.66CR(36.10CR~ Gross)

    ఇక ఈ సినిమాను 18.5 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కాగా టోటల్ గా 8 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించి 2.66 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్ ను కూడా సొంతం చేసుకుంది.

    Mahesh Babu | Sitara : ఇంగ్లీష్ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన మహేష్ కూతురు సితార.. వీడియో వైరల్..

    ఇక అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Tollywood news

    ఉత్తమ కథలు