అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా జరిగిన లాస్ట్ షెడ్యూల్లో చిత్రబృందం ఓ రొమాంటిక్ సాంగ్‌తో పాటు అఖిల్, పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్‌ను కూడా షూట్ చేసింది. అయితే ఈ లవ్ సీన్స్ చాలా బాగావచ్చినట్టు టాక్. అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అక్కినేని అభిమానులు. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే, అఖిల్ ఇద్దరు కలిసి ఉన్న ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Akhil Akkineni & Pooja Hegde from the sets of #MostEligibleBachelor@AkhilAkkineni8 @hegdepooja pic.twitter.com/thgmiOsemY
— BARaju (@baraju_SuperHit) September 18, 2020
ఈ ఫోటోలో అఖిల్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ సోషల్ మీడియాలో వినిస్తోంది. పూజా హెగ్డే విషయానికొస్తే.. వరుసగా.. ‘అరవింద సమేత వీరరాఘవ, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ వంటి హాట్రిక్ హిట్స్ తో దూకుడు మీదుంది. పూజా క్రేజ్‌తో పాటు వరుసగా ప్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకుని మంచి కథ అనుకున్న తర్వాతే అఖిల్ ఈ సినిమాకు ఓకే చేశాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో ఉంది. ఇప్పటికే నాగార్జున కూడా ఈ సినిమా రషెస్ చూసి సంతృప్తి వక్తం చేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ అవి తనదైన శైలిలో ఈ సినిమాను పిక్చరైజ్ చేసాడట. సినిమా చివరి దశ పనుల్లో ఉండటంతో ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్‌లో అఖిల్ లుక్ కొత్తగా వుంది. అఖిల్ విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లుక్ ఆసక్తి రేపుతోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరి చూడాలి.. అనుకున్నట్టే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil, Allu aravind, Most Eligible Bachelor, Pooja Hegde, Tollywood