దయచేసి అలాంటి పనులు చేయకండి.. అభిమానులకు అఖిల్ పిలుపు..

అక్కినేని కుటుంబంలోని మూడో తరం రెండో వారసుడు అక్కినేని అఖిల్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికిగా ఒక మెసేజ్ చేసాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: April 7, 2020, 8:29 PM IST
దయచేసి అలాంటి పనులు చేయకండి.. అభిమానులకు అఖిల్ పిలుపు..
Video : దయచేసి అలాంటి పనులు చేయకండి.. అభిమానులకు అఖిల్ విజ్ఞప్తి
  • Share this:
అక్కినేని కుటుంబంలోని మూడో తరం రెండో వారసుడు అక్కినేని అఖిల్ తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికిగా ఒక మెసేజ్ చేసాడు. వివరాల్లోకి వెళితే.. రేపు అక్కినేని అఖిల్ పుట్టినరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా మహామ్మారి బారిన పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్ కరెక్ట్ కాదన్నాడు. అభిమానులందరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే తన సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. అందరు విధిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అలాగే నా కోసం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను పోస్ట్  చేయండని అభిమానులతో పాటు ప్రేక్షకులను కోరారు.


అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాతోనైనా హీరోగా అఖిల్ తొలి సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading