అక్కినేని మూడో తరం రెండో నట వారసుడు అఖిల్... విదేశాల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. అఖిల్ నిజంగానే అలా చెప్పులు లేకుండా తిరుగుతున్నాడనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈయన తన లేటెస్ట్ మూవీ కోసం ఇలా ఫారిన్ కంట్రీస్‌లో చెప్పులు లేకుండా దర్శనమిచ్చాడు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అఖిల్ గత చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పూజా వరుసగా హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె తాజా సినిమా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ లక్ అఖిల్ సినిమాకు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వరుసగా ప్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకుని అఖిల్ ఈ సినిమాకు ఓకే చేశాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో మెండుగానే ఉండడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసినట్టు సమాచారం. ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది.తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ లుక్‌లో విదేశాల్లో చెప్పులేకుండా అక్కినేని వారసుడు అఖిల్.. ఒక హాలీవుడ్ హీరో తరహాలో ఉన్నాడు. ఈ లుక్ నిశితంగా పరిశీలిస్తే కానీ.. అఖిల్ అని గుర్తు పట్టడానికి లేదు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని వారుపుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనైనా ఫస్ట్ హిట్ అందుకుంటాడా ? లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni akhil, Allu aravind, Most Eligible Bachelor, Telugu Cinema, Tollywood