Akhil Akkineni : అక్కడ దుమ్ములేపుతోన్న అఖిల్ సినిమా.. వంద మిలియన్ వ్యూస్‌తో..

Akhil Akkineni : అక్కినేని అఖిల్.. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో పరిచయమై.. ఇంతవరకు సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.

news18-telugu
Updated: August 5, 2020, 3:25 PM IST
Akhil Akkineni :  అక్కడ దుమ్ములేపుతోన్న అఖిల్ సినిమా.. వంద మిలియన్ వ్యూస్‌తో..
అఖిల్ అక్కినేని Photo : Twitter
  • Share this:
అక్కినేని అఖిల్.. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో పరిచయమై.. ఇంతవరకు సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఆయన ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ వాటిని తనదైన శైలిలో చిత్రకరించాడట. తన కొడుక్కి సరైనా హిట్ అందించాలనీ నాగార్జున ఈ సినిమా పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగా కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూశాడట.  అవుట్ ఫుట్ చాలా బాగుందట.. దీంతో నాగార్జున హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

అది అలా ఉంటే.. అఖిల్ గతంలో నటించి మిస్టర్ మజ్ను చిత్రం హిందీలో దుమ్ము రేపుతుంది. తెలుగులో ఈ సినిమా అంతగా అలరించకపోయినప్పటికీ హిందీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. అక్కడ ఈ సినిమా అదరగొడుతోంది. హిందీ డబ్బింగ్ వర్షెన్ చిత్రం వంద మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక తాజా సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'.. కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. సంక్రాంతి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా థియేట్రకిల్ రిలీజ్ కంటే ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు మంచి ఆఫర్ వచ్చిందట. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌' శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా ఆరున్నర కోట్ల రూపాయలకు దక్కించుకుందట. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: August 5, 2020, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading