Akhil Akkineni : మరోసారి వాయిదా పడిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. కొత్త డేట్ ఇదే..

Most Eligible Bachelor Photo : Twitter

Akhil Akkineni : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడి తాజాగా మరో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

  • Share this:
    అఖిల్ అక్కినేని (Akhil Akkineni)ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. కరోనా కారణంగా పడగా.. ఇటీవల మరోసారి విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించింది. అయితే మరోసారి ఈ చిత్రం వాయిదా పడింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

    సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు ఓపెన్ కావడంతో, చాలా సినిమాలు థియేటర్ల బాట పట్టాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావించి, ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. ఈ సినిమాను పండుగకు ముందు కాకుండా విజయదశమి రోజునే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

    Kondapolam : కొండపొలం నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..

    దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్స్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. అక్టోబర్ 8న వైష్ణవ్ తేజ్ కొండపొలం కూడా విడుదల కానుంది. దీంతో ఈ చిత్రాన్ని కొన్ని రోజులు వెనుకగా జరిపారు.



    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలవనుందని టాక్. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

    Tamannaah Bhatia : బ్లాక్ టాప్‌లో అదరగొట్టిన తమన్నా.. వావ్ అనాల్సిందే..

    మరోవైపు అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని స్పై థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించనున్నారట సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.

    ఇక అది అలా ఉంటే అఖిల్ మైత్రీ మూవీస్‌ నిర్మాణంలో ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఒక లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
    Published by:Suresh Rachamalla
    First published: