Most Eligible Bachelor 16 Days Collections : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. భారీ అంచనాలతో దసరాకు విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇప్పుడు వసూళ్లు కూడా అద్భుతంగా వస్తున్నాయి. 5 రోజుల్లోనే సినిమా 100 శాతం రికవరీ వెనక్కి తెచ్చేసింది. వీక్ డేస్ మొదలైన తర్వాత కూడా మంచి కలెక్షన్స్ రావడం తీసుకొస్తున్నాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. 16 రోజు కూడా రూ. 8 లక్షలకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికీ చాలా చోట్ల వసూళ్లు బాగానే వస్తున్నాయి. పైగా దీనికి పోటీగా విడుదలైన మహా సముద్రం, పెళ్లి సందడి సినిమాలు పోటీ ఇవ్వకపోవడంతో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కుమ్మేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర అయ్యగారు బాగానే వసూలు చేసారు. ఆరేళ్ల కెరీర్‌లో తొలిసారి విజయం రుచి ఎలా ఉంటుందో చూసాడు అఖిల్. ఇన్నేళ్లుగా తాను వేచి చూసిన రోజు రానే వచ్చిందంటూ పండగ చేసుకుంటున్నాడు. ఈ విజయాన్ని అఖిల్ కంటే కూడా ఎక్కువగా నాగార్జున ఎంజాయ్ చేస్తున్నాడు.
కొడుకును వినాయక్, విక్రమ్ కే కుమార్, వెంకీ అట్లూరి లాంటి చాలా మంది హిట్ దర్శకుల చేతుల్లో పెట్టినా రాని విజయం.. 14 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ ఇచ్చాడు. రెండు రోజుల్లోనే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చాలా చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తీసుకుని.. కన్ఫ్యూజ్ అయినా కూడా కాస్త క్లారిటీగానే చెప్పాడు బొమ్మరిల్లు భాస్కర్. మరి ఈ సినిమా 16వ రోజు ఎంత వసూలు చేసింది.. 16రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం..
Nidhhi Agerwal: ప్యాన్ ఇండియా లెవల్లో నిధి అగర్వాల్ దూకుడు మాములుగా లేదుగా..
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 16 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం (తెలంగాణ): రూ. 7.54 కోట్లు
సీడెడ్ (రాయలసీమ): రూ. 4.04 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 2.40 కోట్లు
ఈస్ట్: 1.23 కోట్లు
వెస్ట్: 1.0 కోట్లు
గుంటూరు: 1.38 కోట్లు
కృష్ణా: 1.12 కోట్లు
నెల్లూరు: 0.83 కోట్లు
ఏపీ + తెలంగాణ: 19.54 కోట్లు షేర్ (32.12 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.88 కోట్లు
వరల్డ్ వైడ్ 16 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 23.42 కోట్లు షేర్ (39.30 కోట్ల గ్రాస్)
Rajamouli : నా కన్న ఆ దర్శకుడు తోపు.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Bommarillu Bhaskar, Most Eligible Bachelor, Pooja Hegde, Tollywood