హోమ్ /వార్తలు /సినిమా /

Most Eligible Bachelor 50 crores club: అయ్యగారు గట్టిగా కొట్టారు.. 50 కోట్ల క్లబ్‌లో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'..

Most Eligible Bachelor 50 crores club: అయ్యగారు గట్టిగా కొట్టారు.. 50 కోట్ల క్లబ్‌లో అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'..

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ 50 కోట్లు  (most eligible bachelor)

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ 50 కోట్లు (most eligible bachelor)

Most Eligible Bachelor 50 crores club: ఆరేళ్లుగా అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న రోజు 2021లో వచ్చింది. 2015లో అఖిల్ (Most Eligible Bachelor 50 crores club) సినిమాతో హీరో అయ్యాడు అక్కినేని వారసుడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణంగా విఫలమైంది.

ఇంకా చదవండి ...

ఆరేళ్లుగా అక్కినేని అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న రోజు 2021లో వచ్చింది. 2015లో అఖిల్ సినిమాతో హీరో అయ్యాడు అక్కినేని వారసుడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత రెండేళ్లకు కొడుకును రీ లాంచ్ చేస్తున్నానంటూ హలో సినిమాతో తీసుకొచ్చాడు నాగార్జున. టాక్ బాగున్నా కూడా ఈ సినిమా సైతం నిరాశ పరిచింది. ఇక మూడో సినిమా మిస్టర్ మజ్ను పరిస్థితి కూడా అంతే. యావరేజ్ టాక్ వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత అఖిల్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. అలాంటి సమయంలో 15 ఏళ్లుగా హిట్ లేని బొమ్మరిల్లు భాస్కర్ చేతిలో తన కొడుకును పెట్టాడు నాగార్జున. కథపై ఎంత నమ్మకం లేకపోతే ఫ్లాప్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా చేస్తాడు చెప్పండి..? ఇప్పుడు అనుకున్నట్లుగానే జరిగింది. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా అఖిల్ అక్కినేని చాలా రోజులుగా కలలు కంటున్న 50 కోట్ల కల కూడా తీర్చేసింది.

సెన్సిబుల్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్లే వసూళ్ళు కూడా సాధించింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కోరుకుంటున్న విజయం అందించడంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ అయింది. తాజాగా ఈ సినిమా 50 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. అఖిల్ అక్కినేని కెరీర్ లో మొదటి 50 కోట్ల సినిమా ఇదే.

Movies released after celebs death: ఈ 15 మంది ప్రముఖుల సినిమాలు వాళ్లు చనిపోయాక విడుదలయ్యాయని తెలుసా..?


పెళ్లి తర్వాత జీవితం అందంగా ఉండాలంటే రొమాన్స్ ఉండాలి.. ఆ రొమాన్స్ ఉంటేనే ప్రేమ, పెళ్లి రెండు నిలబడతాయి అనే కాన్సెప్టుతో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమా తెరకెక్కించారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకు కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎంతో బాగా నచ్చింది. వాళ్లకు బాగా కనెక్ట్ అయింది. దానికి తగ్గట్లుగానే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. తమ సినిమాకు ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు సినిమా యూనిట్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.

Puneeth Rajkumar James movie: పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా కోసం అత్యాధునిక టెక్నాలజీ.. రిలీజ్ డేట్ ఇదే..!


వినోదంతో పాటు చక్కటి సందేశం కూడా ఈ సినిమాలో ఉందని దర్శక నిర్మాతలు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమైంది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కెమిస్ట్రీకి తోడు గోపీ సుందర్ మ్యూజిక్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. ముఖ్యంగా లెహరాయి పాట యూ ట్యూబ్ లో 25 మిలియన్ వ్యూస్ అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయం తనలో బాధ్యత పెంచిందని.. ఇకపై కూడా మంచి సినిమాలు చేస్తాను అంటూ అభిమానులకు మాటిచ్చారు అఖిల్ అక్కినేని. మొత్తానికి మొదటి 50 కోట్ల గ్రాస్ అందుకుని తన మార్కెట్ భారీగా పెంచుకున్నారు అఖిల్.

First published:

Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు