అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు సంబందించి ఈరోజు ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పూజా వయ్యారంగా తన కాలుతో అఖిల్‌ను తాకుతుండగా.. అఖిల్ ఓ ల్యాప్ టాప్ ముంగటేసుకుని ఏదో పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ లుక్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. అయితే అఖిల్ గత చిత్రాలు వరుసగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమా పూజా హెగ్డే లక్ కూడా కలిసి సినిమా హిట్ అవుతుందని విశ్వాసంగా ఉంది టీమ్. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ వాటిని తనదైన శైలిలో చిత్రకరించాడట. సరైనా విజయాలు లేక సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఆయనకు ఒక్క సాలీడ్ హిట్ పడలేదు. దీంతో నాగార్జున ఈ సినిమా పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నాడు.
Revealing the Quarantine life of Bachelor & Bachelorette #MostEligibleBachelor @AkhilAkkineni8 @hegdepooja @Baskifilmz @GopiSundarOffl #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/VvmPTCotF5
— BARaju (@baraju_SuperHit) July 29, 2020
అందులో భాగంగా కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో అఖిల్ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున చూశాడట. అవుట్ ఫుట్ చాలా బాగుందట..దీంతో నాగార్జున హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.