మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అఖిల్ అక్కినేని... ముహూర్తం ఫిక్స్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: February 3, 2020, 10:24 AM IST
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా అఖిల్ అక్కినేని... ముహూర్తం ఫిక్స్..
Twitter
  • Share this:
అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అఖిల్ గత చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పూజా వరుసగా హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె తాజా సినిమా అల వైకుంఠపురములో అదిరిపోయే హిట్ అయ్యింది. ఆ లక్ అఖిల్ సినిమాకు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వరుసగా ప్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకుని అఖిల్‌ ఈ సినిమాకు ఓకే చేశాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో మెండుగానే ఉండడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ ఇప్పటికే చాలా వరకు చిత్రీకరించాడు. ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది. దీంతో చిత్రబృందం ఈ సినిమా టైటిల్ ప్రకటించాలనీ నిర్ణయించింది.

అఖిల్, పూజా హెగ్డే Twitter


ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 5:15 గంటలకు జరుగనుంది. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు