మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్... లుక్ అదిరిందిగా..

Most Eligible Bachelor : అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 9, 2020, 8:31 AM IST
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్... లుక్ అదిరిందిగా..
Twitter
  • Share this:
అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అఖిల్ గత చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, అనుకున్న విధంగా అలరించలేకపోయాయి. దీంతో తాజాగా వస్తోన్న ఆయన నాల్గవ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. పూజా వరుసగా హిట్, సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె తాజా సినిమా అల వైకుంఠపురములో అదిరిపోయే హిట్ అయ్యింది. ఆ లక్ అఖిల్ సినిమాకు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వరుసగా ప్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకుని అఖిల్‌ ఈ సినిమాకు ఓకే చేశాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో మెండుగానే ఉండడంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించడంలో సిద్ధహస్తుడైన భాస్కర్ ఇప్పటికే చాలా వరకు చిత్రీకరించాడు. ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉంది. దీంతో ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.  అఖిల్ నాలుగవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమానకు  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే పేరు కన్ఫామ్ చేశారు.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టైటిల్ లోగో విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. విడుదలైన ఫస్ట్ లుక్‌లో అఖిల్ లుక్ కొత్తగా వుంది. అఖిల్ విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లుక్ ఆసక్తి రేపుతోంది.

అఖిల్, పూజా హెగ్డే Twitter


‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో అఖిల్ మంచి హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్ అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు.


First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు