Home /News /movies /

AKHIL AKKINENI AGENT UPDATE AN INTERESTING RUMOUR GOES VIRAL HERE ARE THE DETAILS SR

Akhil Akkineni : అఖిల్ అక్కినేని అంత పని చేస్తున్నారా.. ఇది మామూలు త్యాగం కాదు..

Akhil Akkineni Photo : Twitter

Akhil Akkineni Photo : Twitter

Akhil Akkineni : అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న 2021 ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా స్కేల్ మీద తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    విషయం ఏమంటే అఖిల్ ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటున్న‌ట్లు టాక్ నడుస్తోంది. అఖిల్ ఈ చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సంగీతం ఎస్ఎస్ థ‌మ‌న్ అందిస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా యూరప్‌లో షూటింగ్ జరుపుకుంది. యూరప్‌లోని హంగేరీలో రాజధాని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ చేసింది టీమ్. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షితో పాటు అతుల్య రవి కూడా మరో హీరోయిన్‌గా చేస్తున్నారు.

    Tamannaah Bhatia : బ్లాక్ సూట్‌లో వావ్ అనిపించిన అందాల తమన్నా... లేటెస్ట్ పిక్స్ వైరల్...

    ఇక ఆయన గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Agent Movie, Akhil Akkineni, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు