హోమ్ /వార్తలు /సినిమా /

Akhil Akkineni | Agent : బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్... సాక్షి వైద్యతో పాటు మరో హీరోయిన్‌తో రొమాన్స్..

Akhil Akkineni | Agent : బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్... సాక్షి వైద్యతో పాటు మరో హీరోయిన్‌తో రొమాన్స్..

Akhil in Agent Photo : Twitter

Akhil in Agent Photo : Twitter

Akhil Akkineni | Agent : అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం థియేటర్ రన్ దాదాపు ముగియడంతో ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా నవంబర్ 12 ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమింగ్ కి వస్తుందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.

  ఇక అది అలా ఉంటే అఖిల్ ప్రస్తుతం స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏజెంట్  (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. యూరప్‌లోని హంగేరీలో రాజధాని బుడాపెస్ట్ (Budapest )లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మ‌మ్ముట్టి (Mammootty) కీలకపాత్ర పోషిస్తున్నారు.

  ఈ మూవీలో ఆయన ఆర్మీ అధికారిగా, అఖిల్‌కు సపోర్ట్ ఇచ్చే పాత్రలో క‌నిపించ‌నున్నారట. కాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. దీంతో ఆయన కేరళ తిరిగి వచ్చారు. ఇక మ‌రోవైపు అఖిల్ అక్కినేనితో దర్శకుడు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నారట. అంతేకాదు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్టు తాజా స‌మాచారం. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో సాక్షితో పాటు అతుల్య రవి కూడా మరో హీరోయిన్‌గా చేస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్‌కు ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది.

  Akash Puri Romantic Collections : ఆకాష్ పూరీ రొమాంటిక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే..

  ఇక ఆయన గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

  వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి అంచనాలను మించి పోయే కలెక్షన్స్‌ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Agent Movie, Akhil Akkineni

  ఉత్తమ కథలు