Home /News /movies /

AKHIL AKKINENI AGENT MOVIE TRAILER RELEASE DATE FIX SB

Akhil Akkineni: అఖిల్ ఏజెంట్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...!

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్

అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్

అఖిల్ (Akhil Akkineni)  ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేదని సమాచారం. సినిమాకు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 

    అఖిల్ అక్కినేని (Akhil Akkineni ) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  (Most Eligible Bachelor) తర్వాత నటిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  ఈ సినిమా ట్రైలర్ ఈనెల 15న విడుదల కానున్నట్లు సమాచారం. ఇక ఏజెంట్ (Agent) చిత్రాన్ని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించింది టీమ్. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి (Surender reddy) నిర్మిస్తున్నారు. ఏజెంట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు.

    ఏజెంట్‌ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్‌తో మనకు దర్శనమివ్వనున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా స్కేల్ మీద తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం ఏమంటే అఖిల్ (Akhil Akkineni)  ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటున్న‌ట్లు టాక్ నడుస్తోంది.



    స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. 'సైరా'తో మరోసారి సత్తా చాటిన సురేందర్ రెడ్డి దీనికి దర్శకుడు. సురేందర్ 2 సినిమా బ్యానర్ తో ఇందులో నిర్మాణ భాగస్వామిగానూ సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.  ఈ సినిమాలో అఖిల్ ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలైంది. చేతిలో సిగరేట్‌తో పొగను వదులుతూ అఖిల్ అక్కినేని స్టైలీష్‌గా ఉన్నాడు. ఈ ఫస్టు‌లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం.

    ఇక అఖిల్ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన మూడు చిత్రాలు కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ గతేడాది చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్నారు అఖిల్. ఇకపై చేయబోయే ప్రాజెక్ట్స్ విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.  అందుకు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి కూడా అఖిల్ సినిమాను స్పైగా చూపించనున్నాడు సురేందర్ రెడ్డి.  ఈ సినిమాకు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Agent Movie, Akhil, Akhil Akkineni

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు