Akhil - Agent: హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌ను అందుకున్నారు. 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో సాప్ట్ రోల్లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు. హీరోగా వరుస పరాజయాల్లో ఉన్న అఖిల్ అక్కినేనికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్‌ను అందుకున్నారు. 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో సాప్ట్ రోల్లో కనిపించిన అఖిల్.. ఇపుడు ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఏజెంట్ (Agent)పేరుతో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు.అఖిల్ ఏజెంట్ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన మరో టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏందో ఏందో’ పాటను విడుదల చేసారు. చంద్రబోస్ రాసిన పాటను హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. సంజిత్ హెగ్డే, పద్మలత, హిప్‌హాప్ తమిళ రాసారు.
The breezy romantic melody is here to make you all fall in love ❤️#EndheEndhe song is out now ????
- https://t.co/mtplBYIG5Z #Agent#AgentOnApril28th@AkhilAkkineni8 @sakshivaidya99 @DirSurender @boselyricist @hiphoptamizha @sanjheg @singerpadmalata @AnilSunkara1 @LahariMusic pic.twitter.com/6F8Hvq0qF0 — AK Entertainments (@AKentsOfficial) March 24, 2023
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను భారీ రేటు సోనీ లివ్ దక్కించుకున్నట్టు సమాచారం. దాదాపు అన్ని భాషల్లో రూ. 30 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సమాచారం. అఖిల్ సినిమాను ఎపుడో విడుదల కావాల్సింది. ఈ సంక్రాంతికి విడుదలవుతుందని అందరు అనుకున్నారు. ఎట్టకేలకు సమ్మర్ కానుకగా టాలీవుడ్ చరిత్ర గతిని మార్చిన ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.‘ఏజెంట్’ సినిమాకు టీజర్‌ను వివిధ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏప్రిల్ 28న ఈ డేట్‌లో 1977లో అన్న ఎన్టీఆర్ అడవి రాముడు సినిమా ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత 2006లో మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2017లో ఏప్రిల్ 28న విడుదలైన ‘బాహుబలి 2’ కేవలం తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగ రాసింది.
అలాంటి మెమరబుల్ డేట్‌లో అఖిల్ హీరోగా నటిస్తోన్న ‘ఏజెంట్’ మూవీ రిలీజ్ కావడంపై అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే రోజు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 విడుదల కానుంది. ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి టేకింగ్ అదుర్స్ అనేలా ఉంది. పిక్చరైజైషనే కేక పుట్టిస్తోంది. అఖిల్ గెటప్ కూడా హాలీవుడ్ రేంజ్ లెవల్లో ఉంది. కొన్ని సీన్స్ ఆర్నాల్డ్ లెవల్లో ఉన్నాయి.
అఖిల్ ‘ఏజెంట్’ సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఎయిట్ ప్యాక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా సత్తా చాటడం పక్కా అని చెప్పొచ్చు. అఖిల్ ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో వాటా తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.ఈ సినిమాను అన్ని భాషల్లో కలిపి రూ. 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడుపోయినట్టు సమాచారం. మొత్తంగా అఖిల్ ఏజెంట్‌గా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. మరి చరిత్రను తిరరరాసిన తేదిలో వస్తోన్నఅఖిల్ ‘ఏజెంట్’ మూవీతో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agent Movie, Akhil, Tollywood