హోమ్ /వార్తలు /సినిమా /

Akhanda: అఖండ 50 రోజుల వేడుకకు రంగం సిద్ధం...ముఖ్య అతిథి ఎవరంటే...టాలివుడ్ కు పాత రోజులు తెచ్చిన బాలయ్య...

Akhanda: అఖండ 50 రోజుల వేడుకకు రంగం సిద్ధం...ముఖ్య అతిథి ఎవరంటే...టాలివుడ్ కు పాత రోజులు తెచ్చిన బాలయ్య...

ఇప్పటికే ఏడు వరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరో మూడు రోజుల్లో 50 రోజులను పూర్తి చేసుకోబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ  హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలైంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.

ఇప్పటికే ఏడు వరాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరో మూడు రోజుల్లో 50 రోజులను పూర్తి చేసుకోబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలైంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.

బాలయ్య కెరీర్ లో తొలిసారిగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా అఖండ సత్తా చాటింది. అంతేకాదు జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం కూడా అఖండ లాంగ్ రన్ కు దోహద పడే అంశమే. ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది.

ఇంకా చదవండి ...

Akhanda:  ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా మూడు రోజులు ఆడిందంటే చాలా గొప్ప, అందులోనూ పాండెమిక్ సమయాల్లో ఒక సినిమా మొదటి రోజైనా ఆడుతుందా లేదా అనేది డౌట్ గా మారింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా లేదా, అనేది కూడా సందేహంగా మారిపోయిన రోజులివి. పెద్ద సినిమాలు షూటింగులు, సెన్సార్ పూర్తి చేసుకొని కూడా రిలీజ్ నోచుకోని సమయంలో బాలయ్య మాత్రం అరుదైన ఫీట్ సాధించాడు. తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. డిసెంబర్ 2న థియేటర్లను తాకిన అఖండ తుపాన్, కలెక్షన్లను కొల్లగొట్టింది. మాసు, క్లాసు అనే తేడా లేకుండా, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, పారిస్, సింగపూర్ సహా అనే ఏపీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని అన్ని సెంటర్లలోనూ అఖండ సినిమా థియేటర్లు జాతరను తలపించాయి. థియేటర్లకు వెళ్లి హంగామా చేయాలని, ఒళ్లు మరిచి కేరింతలు కొట్టాలని గత రెండేళ్లుగా వెయిట్ చేసిన జనాలకు అఖండ చిత్రం పెద్ద సెలబ్రేషన్ లా మారింది.

Rana Daggubati - Unstoppable: అన్నీ అయిపోయాయి.. పెళ్లొక్కటే మిగిలింది.. అందుకే చేసుకున్నా..


అయితే అఖండ సినిమాకు బ్రేకులు వేసేందుకు పెద్దగా సినిమాలు ఏమి రిలీజ్ కాకపోవడం, డిసెంబర్ 17న పుష్ప మాత్రమే రిలీజ్ అయినప్పటికీ, మిశ్రమ స్పందన సాధించింది. దీంతో అఖండకు అడ్డు లేకుండా పోయింది. అలాగే అఖండ రిలీజ్ నుంచి ఏకంగా మూడు వారాల పాటు పెద్ద సినిమాలు అడ్డు తగల్లేదు.  ఆ తర్వాత వచ్చన శ్యాం సింగరాయ్ సినిమా సైతం అఖండ జోరును తగ్గించలేక పోయింది. దీంతో బాలయ్య కెరీర్ లో తొలిసారిగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా అఖండ సత్తా చాటింది. అంతేకాదు జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం కూడా అఖండ లాంగ్ రన్ కు దోహద పడే అంశమే. ఇక చివరగా అఖండ సినిమా జనవరి 20న అఫీషియల్ గా 50 రోజుల పండగను జరుపుకోనుంది. ఇండస్ట్రీలో 50 రోజులు ఓ సినిమా పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా రిలీజ్ కాస్త మిక్స్ డ్ టాక్ వస్తేనే నెల తిరిగే లోపు ఓటీటీలో పడిపోతోంది. అలాంటి నేపథ్యంలో అఖండ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రోజులు ఆడటం మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక సుదర్శన్ 35 ఎంఎం వేదికగా ఈ వేడుకలు నిర్వహంచనున్నట్లు తెలిసింది. అంతేకాదు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సైతం 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారట. ఇందుకోసం నిర్మాత స్వస్థలం అయిన సూర్యపేటలో భారీ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు బాలయ్యతో పాటు, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత సిసలైన క్లీన్ బ్లాక్ బస్టర్ సినిమాగా అఖండ నిలిచిందని బాలయ్య ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

First published:

Tags: Akhanda

ఉత్తమ కథలు