Akhanda - NBK : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు..

బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ఫస్ట్ సింగిల్ (Twitter/Photo)

Akhanda - NBK : బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ‘అఖండ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీటైంది. ప్రస్తుతం ఈ సినిమాలో బ్యాలెన్సింగ్‌గా ఉన్న పాటలను షూట్ చేస్తున్నారు.

  • Share this:
    Akhanda - NBK : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్‌ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.

    తాజాగా ఈ సినిమా  నుంచి మొదటి పాటను  విడుదల చేయడానికి ముమూర్తం ఖరారైంది. ఈ సినిమాలోని ‘అడిగా అడిగా’ పాటను ఈ శనివారం సాయంత్రం 5. 33 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది.


    అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్  కారణంగా అన్ని సినిమాల మాదిరే ఈ సినిమా షూటింగ్‌కు కలగడంతో ఈ సినిమా విడుదలను వాయిదా పడింది. లేకపోతే ఈ పాటికి థియేట్రికల్ రన్ ముగిసి ఓటీటీతో పాటు శాటిలైట్స్‌లో కూడా ఈ సినిమా ప్రసారమై ఉండేది. తాజాగా ‘అఖండ’ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రీసెంట్‌గా తమిళనాడులో ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాలో అఘోరగా బాలయ్య పాత్ర హైలెట్ అని చెబుతున్నారు.ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం.

    Akhanda NBK Latest Update Boyapati Akhana Musical Roar Multiple Musical Notes With The Magical Melody Adigag Adigaa Red Full Lyrical Video,Akhanda - NBK : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు..,Balakrishna,Akhanda NBK Latest Update,akhanda Release Date,Akhanda On Deepawai,Akhanda Movie First Single,Adiga Adigaa,Pragya Jaiswal,Latest Telugu News,Balakrishna twitter,Balakrishna Akhanda Climax Shoot Starts,Balakrishna akhanda movie shoot resumes,Balakrishna boyapati akhanda movie shooting started,Balakrishna corona movies,telugu cinema,Balakrishna gopichand malineni movie postpone,బాలయ్య అఖండ సినిమా షూటింగ్ మొదలు,బాలయ్య బోయపాటి శ్రీను అఖండ వాయిదా,బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ వాయిదా,బాలకృష్ణ బోయపాటి శ్రీను అఖండ మూవీ క్లైమాక్స్ స్టార్ట్,దీపావళికి విడుదల అఖండ,అడిగా అడిగా సాంగ్  Akhanda - NBK : బాలకృష్ణ ‘అఖండ’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారు..
    బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ఫస్ట్ సింగిల్ (Twitter/Photo)


    ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ రీసెంట్‌గా రవితేజ‌తో ‘క్రాక్’ వంటి పోలీస్ మాస్ యాక్షన్ మూవీతో మెప్పించిన గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    దాంతో పాటు సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్‌ తో పాటు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ప్రాజెక్ట్‌ను తనయుడు మోక్షజ్ఞ హీరోగా బాలయ్య దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టు బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: