Home /News /movies /

AKHANDA NANDAMURI BALAKRISHNA AKHANDA ANOTHER RARE RECORD THIS MOVIE COMPLETES 175 DAYS RUN IN GUNTUR TA

Akhanda - Balakrishna : బాలకృష్ణ‘అఖండ’ మరో అరుదైన రికార్డ్.. భారత దేశంలో ఈ ఫీట్ అందుకున్న ఒకే ఒక్క హీరో..

బాలకృష్ణ ‘అఖండ’ 175 రోజులు పూర్తి (Twitter/Photo)

బాలకృష్ణ ‘అఖండ’ 175 రోజులు పూర్తి (Twitter/Photo)

Balakrishna - Akhanda 175 Days Silver Jublee | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి ...
    Balakrishna - Akhanda 175 Days  | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ డిజిటల్ యుగంలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల వేడుకకు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో   50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు.

    కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా  ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజులు.. ఆ తర్వాత 100 రోజుల.. ఇపుడు ఏకంగా 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.  ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఆ తర్వాత సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది.  ఈ సినిమా 20 థియేటర్స్‌లో  100 రోజుల పూర్తి చేసుకుంది. అందులో 4 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడింది. తాజాగా ఈ సినిమా 175 రోజులు పరుగును పూర్తి చేసుకుంది. అది కూడా గుంటూరు జిల్లా చిలకలూరి పేటలోని రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

    Sarkaru Vaari Paata : మహేష్ బాబు సర్కారు వారి పాట 11 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

    ఈ డిజిటల్ యుగంలో ఒక సినిమా ఓ థియేటర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం అది.. మొత్తంగా గత పదేళ్లలో ఒక హీరో సినిమా 100 రోజులతో పాటు ఏకంగా ఒక కేంద్రంలో 175 రోజులు పూర్తి చేసుకోవడం మన దేశంలో బాలయ్యకు మాత్రమే సాధ్యమైందనే చెప్పాలి. బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి. ఈ ఏరియాలోని బాలయ్య సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటాయి. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సినిమా కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్‌లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఈ రికార్డు లేదు.  బాలయ్య ‘అఖండ’ సినిమా ఎమ్మిగనూరులో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సెంటర్లో బాలయ్య సినిమాలు ఏకంగా 11 సినిమాలు డైరెక్ట్‌గా 4 షోలతో కంటిన్యూ 100 రోజులుగా పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి.

    K Raghavendra Rao : దర్శకుడు కే రాఘవేంద్రరావు, వైజయంతీ మూవీస్ అశ్వనీదత్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్..


    సీడెడ్‌లో ఈ రెంజ్‌లో 100 రోజులకు పైగా బాలయ్య సినిమాలు ఓ రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. రాయలసీమలో ఈ రికార్డు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే. బాలయ్య గత సినిమాలు పెద్దన్నయ్య, సమమర సింహా రెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాల తర్వాత ‘అఖండ’ ఆ లిస్టులో చేరింది. ఈ సినిమాలే కాకుండా బాలయ్య నటించిన పలు సినిమాలు షిప్టులతో 100 రోజులు ఆడిన సందర్భాలున్నాయి. ఇందులో సమరసింహాెరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. లెజెండ్ ఏకంగా 421  రోజులు ఆడి హిస్టరీ తిరగ రాసింది. అఖండ సినిమ ా విషయానికొస్తే.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 95.55 కోట్ల షేర్.. రూ. 200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda, Balakrishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు