Home /News /movies /

AKHANDA MOVIE BALAKRISHNA UNSTOPPABLE COLLECTIONS AT US BOX OFFICE EVK

Akhanda: యూఎస్ బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌కృష్ణ "అన్‌స్టాప‌బుల్" క‌లెక్ష‌న్స్‌

నందమూరి బాలకృష్ణ Photo : Twitter

నందమూరి బాలకృష్ణ Photo : Twitter

బాల‌కృష్ణ న‌టించిన అఖండ చిత్రం ఓవర్సీస్‌లో $800K వసూలు చేసి బాల‌కృష్ణ సినిమాల్లో రికార్డు సృష్టించింది. దీంతో యూస్ఎస్‌లో బాల‌కృష్ణ సినిమా క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపిస్తోంది. క‌రోనా తరువాత మూత‌ప‌డి తెరుచుకొన్న థియేట‌ర్ల‌కు బాల‌కృష్ణ సినిమా క‌లెక్ష‌న్‌లు కొత్త జోష్‌ను తీసుకొచ్చాయి.

ఇంకా చదవండి ...
    నందమూరి బాలకృష్ణ (Bala Krishna) నటించిన అఖండ (Akhanda) చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డుల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రం ఆదివారం చాలా అద్భుతంగా న‌డిచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లలో 95 శాతం కంటే ఎక్కువ సినిమా హాళ్లు ఈ రోజు హౌస్‌ఫుల్ షోలతో న‌డిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో $800K వసూలు చేసి బాల‌కృష్ణ సినిమాల్లో రికార్డు సృష్టించింది. నైజాంలో ఈ చిత్రం 12 కోట్ల రూపాయల మార్కును దాటింది. అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 4 రోజుల్లోనే 44.86 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. నాలుగో రోజు కూడా ఏపీ, తెలంగాణలో 8.31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పైగానే తీసుకొచ్చింది.

    మరో 9 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్‌ (Safe Zone)కు వస్తుంది. నాలుగో రోజు ఆదివారం కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. వీక్ డేస్‌ (Week Days)లో కూడా ఇదే చేస్తే బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నట్లే.

    Pooja Hegde: సన్ టోపీ.. అదిర‌పోయే లుక్స్‌తో.. పూజా హెగ్డే కొత్త పిక్స్






    క‌లెక్ష‌న్‌లు గ్యారెంటీ..
    మరోవైపు, ఈ వారం థియేటర్లలో విడుదలైన అఖండ బాక్సాఫీస్ రన్‌కు ఎటువంటి ఢోకా లేదు. డిసెంబర్ 10న థియేటర్లలో విడుదల కావాల్సిన కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి డిసెంబర్ 31కి వాయిదా పడింది. కాబట్టి, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లలోని థియేటర్లలో అఖండ ప్రదర్శనను క్యాష్ చేసుకునేందుకు భావిస్తున్నారు.

    Squid Game: ఓటీటీలో అత్యధిక‌మంది వీక్షించిన "స్క్విడ్ గేమ్" వెబ్‌సిరీస్ ఇప్పుడు తెలుగులో..


    అఖండ అనూహ్య విజయంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నాన్ మెట్రోపాలిటన్ ఏరియాల్లో థియేట్రికల్ బిజినెస్ భారీగా ఊపందుకుంది. అఖండ విజయంపై తెలుగు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాని, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత శర్వానంద్ కూడా అఖండ టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరిగిన నాగశౌర్య లక్ష్యం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహాసముద్రం స్టార్ మాట్లాడుతూ “జై బాలయ్య. అఖండ చిత్రాలను జరుపుకొనే సంప్రదాయాన్ని మళ్లీ బాలకృష్ణ తీసుకొచ్చారు. ఇది మంచి సీజన్ మరియు మంచి ప్రారంభం. తెలుగు ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు'' అన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Akhanda, Akhanda movie, Bala Krishna, Bala Krishna Nandamuri

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు