హోమ్ /వార్తలు /సినిమా /

Akhanda 4 days WW collections: ‘అఖండ’ 4 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?

Akhanda 4 days WW collections: ‘అఖండ’ 4 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది.. ఎంత రావాలి..?

నందమూరి బాలకృష్ణ - అఖండ

నందమూరి బాలకృష్ణ - అఖండ

Akhanda 4 days WW collections: అఖండ (Akhanda 4 days WW collections) సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తున్నాడు ఈయన.

ఇంకా చదవండి ...

అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తున్నాడు ఈయన. అఖండ సినిమా 4 రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన నాలుగో రోజు కూడా 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతరం చూపించాడు. తొలి 4 రోజులు అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు పడటమే కాదు.. చాలా చోట్ల రికార్డులు కూడా తిరగరాసాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత.. ఇంకా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది.

రూలర్, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అఖండ మాత్రం అద్భుతం చేసింది. ఈ సినిమా 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 44 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 38 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది అఖండ. ఈ జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా 4 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

Pushpa - RRR - Bheemla Nayak: ఇంతకంటే ఏం కావాలి.. టాలీవుడ్‌కు ‘అఖండ’మైన భరోసా ఇచ్చిన బాలకృష్ణ..


నైజాం: 12.11 కోట్లు

సీడెడ్: 9.81 కోట్లు

ఉత్తరాంధ్ర: 3.74 కోట్లు

ఈస్ట్: 2.61 కోట్లు

వెస్ట్: 2.04 కోట్లు

గుంటూరు: 3.26 కోట్లు

కృష్ణా: 2.28 కోట్లు

నెల్లూరు: 1.71 కోట్లు

Akhanda - Love Story - Vakeel Saab: USAలో ‘అఖండ’ ప్రభంజనం.. 2021లో ఓవర్సీస్ టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..


ఏపీ-తెలంగాణ టోటల్: 37.56 కోట్లు (59.10 కోట్లు గ్రాస్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.25 కోట్లు

ఓవర్సీస్: 4.05 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్: 44.86 కోట్లు (74 కోట్లు గ్రాస్)

Nagarjuna - Karthi - Sekhar Kammula: ఏంటి ఈ 10 మంది మెకానికల్ ఇంజనీర్‌లా.. ఇండస్ట్రీలో కుమ్మేస్తున్నారుగా..!


అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 4 రోజుల్లోనే 44.86 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. నాలుగో రోజు కూడా ఏపీ, తెలంగాణలో 8.31 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పైగానే తీసుకొచ్చింది. మరో 9 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్‌కు వస్తుంది. నాలుగో రోజు ఆదివారం కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. వీక్ డేస్‌లో కూడా ఇదే చేస్తే బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నట్లే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akhanda movie, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు