Home /News /movies /

AKHANDA BALAKRISHNA NANDAMURI BOYAPATI SRINU AKHANDA THEATRICAL TRAILER RELEAS DATE OFFICIALLY ANNOUNCED TA

Balakrishna - Akhanda : బాలకృష్ణ ’అఖండ’ మూవీ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు..

‘అఖండ’ థియేట్రికల్ ట్రైలర్‌కు మూహుర్తం ఖరారు (Twitter/Photo)

‘అఖండ’ థియేట్రికల్ ట్రైలర్‌కు మూహుర్తం ఖరారు (Twitter/Photo)

BalaKrishna- Akhanda : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది.

  BalaKrishna- Akhanda : నందమూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు.  ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’(Akhanda) టైటిల్ పోస్టర్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు టాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో 50M వ్యూస్ క్రాస్ చేసిన టీజర్‌గా బాలకృష్ణ ‘అఖండ’ సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘అఖండ’ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారు. ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని ఈ సినిమా పోస్టర్స్‌ బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.

  తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నవంబర్ 14న రాత్రి 7 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.


  ఇప్పటికే ‘అఖండ’ మూవీ నుంచి  విడుదల చేసిన రెండు పాటలక మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా  జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. మరో కథానాయికగా పూర్ణ యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తారా లేదా ఇంకా వేరే ఏదైనా డేట్ ప్రకటిస్తారా అనేది చూడాలి.

  BalaKrishna - Nani : నందమూరి బాలకృష్ణకు నాని మధ్య ఉన్న ఈ అనుబంధం తెలుసా..


  ‘అఖండ’ సినిమా విషయానికొస్తే.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌ హక్కులు రూ. 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి, తెలంగాణ (నైజాం) ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడుపోయినట్టు సమాచారం. ఇక రాయలసీమ (సీడెడ్)  హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

  Balakrishna Remakes: నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

  ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. ‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేని తో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరో కథానాయికగా భావన పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.

  NBK 107 : అట్టహాసంగా ప్రారంభమైన బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ..

  పల్నాడు బ్యాక్ డ్రాప్‌లో నిజ జీవిత కథ నేపథ్యంలో గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలయ్య.. ఆహా ఓటీటీ కోసం ఓ టాక్ షో చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. మోహన్ బాబు గెస్ట్‌గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రెండో ఎపిసోడ్‌కు నాని వచ్చి ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations, Miryala Ravinder Reddy, NBK 106, Pragya jaiswal, Tollywood

  తదుపరి వార్తలు