Home /News /movies /

AKHANDA BALAKIRSHNA NANDAMURI AKHANDA 100 DAYS CELEBRATIONS AT KARNOOL STBC GROUNDS TA

Akhanda - Balakrishna : బాలకృష్ణ ‘అఖండ’ 100 రోజుల వేడుక.. 20 కేంద్రాల్లో సెంచరీ.. సాధించిన రికార్డులు..

‘అఖండ’ 100 రోజుల వేడుక (Twitter/Photo)

‘అఖండ’ 100 రోజుల వేడుక (Twitter/Photo)

Balakrishna - Akhanda 100 Days Celebrations | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. తాజాగా ఈ సినిమా శతదినోత్సవ వేడుకల కర్నూలులో అట్టహాసంగా నిర్వహించారు.

ఇంకా చదవండి ...
    Balakrishna - Akhanda 100 Days Celebrations | నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా తాజాగా  100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా   STBC గ్రౌండ్స్ కర్నూలు‌లో ఈ సినిమా కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు హీరో బాలయ్యతో పాటు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్ తదితరులు వచ్చేసి ఈ సినిమా విజయవంతంగా 100రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ఫంక్షన్‌కు బాలయ్య అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

    50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా  ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

    Radhe Shyam US Premiers : ’రాధే శ్యామ్’ సహా ఓవర్సీస్‌లో US ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

    ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఇపుడీ సినిమా ఏకంగా శనివారంతో సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. తాజాగా ఈ సినిమా 20 థియేటర్స్‌లో 100 రోజుల పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమ ాప్రపంచ వ్యాప్తంగా రూ. 95.55 కోట్ల షేర్.. రూ. 106 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

    20 థియేటర్స్‌లో బాలకృష్ణ ‘అఖండ’ మూవీ (Twitter/Photo)


    బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి. ఈ ఏరియాలోని బాలయ్య సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటాయి. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సినిమా కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్‌లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఈ రికార్డు లేదు. తాజాగా బాలయ్య ‘అఖండ’ సినిమా ఎమ్మిగనూరులో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సెంటర్లో బాలయ్య సినిమాలు ఏకంగా 11 సినిమాలు డైరెక్ట్‌గా 4 షోలతో కంటిన్యూ 100 రోజులుగా పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి.

    Radhe Shyam : 2022లో ప్రభాస్ ’రాధే శ్యామ్’ మరో రికార్డు.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ దూకుడు..

    సీడెడ్‌లో ఈ రెంజ్‌లో 100 రోజులకు పైగా బాలయ్య సినిమాలు ఓ రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. రాయలసీమలో ఈ రికార్డు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే. బాలయ్య గత సినిమాలు పెద్దన్నయ్య, సమమర సింహా రెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాల తర్వాత ‘అఖండ’ ఆ లిస్టులో చేరింది. ఈ సినిమాలే కాకుండా బాలయ్య నటించిన పలు సినిమాలు షిప్టులతో 100 రోజులు ఆడిన సందర్భాలున్నాయి. ఇందులో సమరసింహాెరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. లెజెండ్ ఏకంగా 421  రోజులు ఆడి హిస్టరీ తిరగ రాసింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, Boyapati Sreenu, NBK, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు