హోమ్ /వార్తలు /సినిమా /

Akhanda 6 days WW collections: బాలయ్య ‘అఖండ’ 6 డేస్ కలెక్షన్స్.. 100 కోట్ల వైపు అడుగులు..

Akhanda 6 days WW collections: బాలయ్య ‘అఖండ’ 6 డేస్ కలెక్షన్స్.. 100 కోట్ల వైపు అడుగులు..

నందమూరి బాలకృష్ణ - అఖండ

నందమూరి బాలకృష్ణ - అఖండ

Akhanda 6 days WW collections: రూలర్ (Ruler), ఎన్టీఆర్ మహానాయకుడు (NTR Mahanayakudu) లాంటి సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అఖండ (Akhanda Collections) మాత్రం అద్భుతం చేసింది. ఈ సినిమా ప్రభంజనం ముందు బాలయ్య (Balakrishna) గత రికార్డులను ఈజీగా దాటేసింది ఈ చిత్రం.

ఇంకా చదవండి ...

అఖండ సినిమా 100 కోట్ల వైపు అడుగులు వేస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ వర్గాలను సైతం షాక్ చేసేలా అఖండ ప్రభంజనం సాగుతుంది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తున్నాడు ఈయన. అఖండ సినిమా 6 రోజుల్లోనే 85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన 6వ రోజు కూడా 3 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఔరా అనిపించింది అఖండ. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతరం చూపించాడు. తొలి 6 రోజులు అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు పడటమే కాదు.. చాలా చోట్ల రికార్డులు కూడా తిరగరాసాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత.. ఇంకా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది.

రూలర్, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అఖండ మాత్రం అద్భుతం చేసింది. ఈ సినిమా 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 51.82 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 43 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది అఖండ. ఈ జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా 6 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

This Week movies: ఈ వారం ఓటిటి, థియేటర్స్‌లో విడుదల కానున్న 8 సినిమాలు ఇవే..


నైజాం: 14.33 కోట్లు

సీడెడ్: 11.38 కోట్లు

ఉత్తరాంధ్ర: 4.38 కోట్లు

ఈస్ట్: 3.00 కోట్లు

వెస్ట్: 2.36 కోట్లు

గుంటూరు: 3.65 కోట్లు

కృష్ణా: 2.65 కోట్లు

నెల్లూరు: 1.92 కోట్లు

Hat Trick Combination: బాలయ్య, బోయపాటి మాదిరే.. తెలుగులో హ్యాట్రిక్ అందుకున్న 8 కాంబినేషన్స్ ఇవే..


ఏపీ-తెలంగాణ టోటల్: 43.67 కోట్లు (68.80 కోట్లు గ్రాస్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.65 కోట్లు

ఓవర్సీస్: 4.50 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 51.82 కోట్లు (84.85 కోట్లు గ్రాస్)

అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 6 రోజుల్లోనే 52 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. 6వ రోజు కూడా ఏపీ, తెలంగాణలో 2.53 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకు పైగానే తీసుకొచ్చింది. మరో 2 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్‌కు వస్తుంది. మంగళవారం కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. దాంతో సినిమా నిలబడిపోయింది. వీక్ డేస్‌లో కూడా ఇదే చేస్తే బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నట్లే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akhanda movie, Balakrishna, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు