హోమ్ /వార్తలు /సినిమా /

Akhanda 3 days WW collections: ‘అఖండ’ 3 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం..

Akhanda 3 days WW collections: ‘అఖండ’ 3 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం..

<span style="color: #ff0000;">నైజాం: 14.87 కోట్లు</span>

<span style="color: #ff0000;">నైజాం: 14.87 కోట్లు</span>

Akhanda 3 days WW collections: బాలయ్య కసితీరా జూలు విదిలిస్తే బాక్సాఫీస్ ఎలా బద్దలైపోతుందా తెలుసా..? సమాధానం కావాలంటే అఖండ కలెక్షన్స్ చూస్తే సరిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య శివతాండవం చేస్తున్నాడు. బోయపాటి (Akhanda 3 days WW collections) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ సినిమా 3 డేస్ కలెక్షన్స్ వచ్చేసాయి.

ఇంకా చదవండి ...

వామ్మో.. వామ్మో ఏందీ అరాచకం..? కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత చూసిన తర్వాత ఎవరైనా ఇదే అనాల్సిందే. టికెట్ రేట్లు తగ్గించారు.. కరోనా నిబంధనలు పాటించమన్నారు.. ఇన్ని ఆంక్షలున్నా చూడా బాలయ్య మాత్రం మామూలుగా రచ్చ చేయలేదు. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతరం చూపించాడు. తొలి మూడు రోజులు అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు పడటమే కాదు.. చాలా చోట్ల రికార్డులు కూడా తిరగరాసాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత.. ఇంకా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది.

రూలర్, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అఖండ మాత్రం అద్భుతం చేసింది. ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 29.50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. ఈ జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా 3 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

Balakrishna Akhanda: ఇదీ బాలయ్య పవర్.. ‘అఖండ’ కోసం థియేటర్స్‌కు వచ్చిన అఘోరాలు..


నైజాం: 9.16 కోట్లు

సీడెడ్: 7.78 కోట్లు

ఉత్తరాంధ్ర: 2.87 కోట్లు

ఈస్ట్: 2.04 కోట్లు

వెస్ట్: 1.62 కోట్లు

గుంటూరు: 2.71 కోట్లు

కృష్ణా: 1.66 కోట్లు

నెల్లూరు: 1.41 కోట్లు

Bigg Boss 5 Telugu 13th week Elimination: ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో తెలిసిపోయిందిగా..


ఏపీ-తెలంగాణ టోటల్: 29.25 కోట్లు (44.60 కోట్లు గ్రాస్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.60 కోట్లు

ఓవర్సీస్: 3.55 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ 3 డేస్ కలెక్షన్స్: 35.40 కోట్లు (56.90 కోట్లు గ్రాస్)

Balakrishna fan dies: ‘అఖండ’ సినిమా చూస్తూ బాలయ్య అభిమాని, ప్రముఖ ఎగ్జిబిటర్ హఠాన్మరణం..


అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 3 రోజుల్లోనే 35 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మూడో రోజు కూడా ఏపీ, తెలంగాణలో 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్లకు పైగానే తీసుకొచ్చింది. మరో 18 కోట్లు వసూలు చేస్తే సినిమా సేఫ్ జోన్‌కు వస్తుంది. నాలుగో రోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ బాగానే వస్తాయి. వీక్ డేస్‌లో కూడా ఇదే చేస్తే బాలయ్య మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నట్లే.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akhanda movie, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు