Akash Puri : ఆకాష్ పూరీ కోసం రంగంలోకి ప్రభాస్, విజయ్ దేవరకొండ.. తనయుడు పూరీ జగన్నాథ్ స్కెచ్ మాములుగా లేదుగా..

ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ మూవీ ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (Twitter/Photo)

Akash Puri  - Prabhas - Vijay Devarakonda - Puri Jagannadh - Romantic : ఆకాష్ పూరీ కోసం రంగంలోకి ప్రభాస్, విజయ్ దేవరకొండ.. తనయుడు పూరీ జగన్నాథ్ స్కెచ్ మాములుగా లేదంటున్నారు పూరీ జగన్నాథ్. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Akash Puri  - Prabhas - Vijay Devarakonda - Puri Jagannadh - Romantic : ఆకాష్ పూరీ కోసం రంగంలోకి ప్రభాస్, విజయ్ దేవరకొండ.. తనయుడు పూరీ జగన్నాథ్ స్కెచ్ మాములుగా లేదంటున్నారు పూరీ జగన్నాథ్. వివరాల్లోకి వెళితే..  పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కేతిక శర్మ హీరోయిన్స్‌గా  వస్తోన్న కొత్త లవ్ స్టోరీ బ్యాగ్రౌండ్ సినిమా ‘రొమాంటిక్’. ఈ రొమాంటిక్ ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా ఇప్పటికే పూర్తి అయి ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేసారు. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  మధ్యలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అటువంటిది ఏమి లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

    రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనుంది. అంతేకాదు రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో కనిపించనుందట. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 22న వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.  త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు.


    వీరితో పాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

    Tollywood Brothers : సినీ ఇండస్ట్రీలో హీరోలుగా సత్తా చాటిన అన్నదమ్ములు.. నందమూరి టూ మెగా బ్రదర్స్..

    ఇక ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆకాష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు ఆకాష్. అయితే ఆకాష్ నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేదు. దీంతో ఈ సినిమాతోనైనా మంచి విజయాన్ని అందుకోవాలనీ చూస్తున్నాడు.

    Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..


    ఇక చోర్ బజార్ అనే పేరుతో వస్తోన్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నాడు. చోర్ బజార్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: