ముద్దుతోనే ముగించనున్న పూరి తనయుడు.. ఆ సీన్ ఓ రేంజ్‌లో..

Romantic : పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా 'రోమాంటిక్' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 13, 2020, 3:27 PM IST
ముద్దుతోనే ముగించనున్న పూరి తనయుడు.. ఆ సీన్ ఓ రేంజ్‌లో..
రొమాంటిక్ పోస్టర్ Photo : Twitter
  • Share this:
పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా  'రోమాంటిక్' పేరుతో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువ డైరెక్టర్ అనిల్ పాదూరి డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చాలా వరకు గోవాలో చిత్రీకరణ జరుపుకుంది. కొంతమేరకు హైదరాబాద్‌లో జరుపుకుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సీన్స్‌‌పాటు సెట్స్ వేసి కొన్ని సాంగ్స్ షూట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఆకాష్ పూరిగా జంటగా ఉత్తరాది భామ కేతిక శర్మ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో లిప్ టు లిప్ కిస్ సీన్ ఉందట. సినిమా చివరి షాట్ కిస్ తోనే ఎండ్ అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి ‘రొమాంటిక్’ను రొమాన్స్ తో ముగించబోతున్నారు అన్నమాట. ఈ సినిమాకు సంబందించి ఆ మధ్య ఓ పోస్టర్‌ను, టీజర్‌ను కూడా చిత్రబ‌‌ృందం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈసినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో ముఖ్య పాత్రలో మందిరా బేడి కనిపించనుంది. మందీరా సాహోలో కల్కిగా మెరిసిన సంగతి తెలిసిందే.

మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా మే 29న విడుదలకావాల్సివుంది. అయితే కారోనా దెబ్బకు విడుదల తేది ఏమైన మారనుందా అనేది తెలియాల్సివుంది.
First published: April 13, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading