Akash Puri Romantic Twitter Review: పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ హీరోయిన్గా వస్తోన్న లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’. సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు అంటే అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
Akash Puri Romantic Twitter Review: పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri) ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్గా వస్తోన్న లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’(Romantic). సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు అంటే అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇక రీసెంట్గా ప్రభాస్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్‌ను స్వయంగా ఇంటర్వూ చేయడం కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీవ్యూస్ ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయానలు పంచుకుంటున్నారు. రొమాంటిక్ ఎలా ఉంది.. కథేంటీ, కథనం ఎలా ఉంది.. హీరో హీరోయిన్స్ల నటన ఎలా ఉంది.. ఈ సినిమా తెలుగు వారిని ఏ మాత్రం ఆకట్టుకోగలదు వంటి అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం..
రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనుంది.
అంతేకాదు రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.
Breaking update Hero #Ram Cameo in #Romantic movie 😍🤩🥰
ఇక ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆకాష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నారు ఆకాష్. ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నారు. చోర్ బజార్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.