Akash Puri Romantic Collections: పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri) ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్గా వస్తోన్న లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’(Romantic). సరికొత్త కాన్సెప్ట్‌తో లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి పోయి ఊహించని రేంజ్లో కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పోటికి మరో సినిమా విడుదలైనప్పటికి.. మరోవైపు మిక్సుడ్గా వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ ముఖ్యంగా యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోందని అంటున్నారు.
ఫస్ట్ డే కలెక్షన్స్…
Nizam: 55L
Ceeded: 27L
UA: 19L
East: 12L
West: 9L
Guntur: 14L
Krishna: 9.4L
Nellore: 7L
AP-TG Total:- 1.52CR(2.25CR~ Gross)
Ka+ROI: 3L
OS – 5L
Total WW: 1.61CR(2.42CR~ Gross)
రొమాంటిక్ సినిమాను మొత్తంగా 4.6 కోట్ల రేటుకి అమ్మగా.. ఈ సినిమా 5 కోట్ల రేంజ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.39 కోట్ల షేర్ని అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.
Anchor Anasuya : మాస్టర్ చెఫ్ కోసం పొట్టి నిక్కరులో పిచ్చెక్కించిన యాంకర్ అనసూయ...
రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది.
అంతేకాదు రమ్యకృష్ణ ఆకాష్ పూరికి అత్త పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.
ఇక ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆకాష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నారు ఆకాష్. ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నారు. చోర్ బజార్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akash Puri, Romantic Movie, Tollywood news