Home /News /movies /

AKASH PURI KETIKA SHARAM ROMANTIC MOVIE STREMING ON AHA OTT PLATFORM TODAY ONWORDS TA

Romantic Movie Digital Streming : ‘ఆహా’లో నేటి నుంచే ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ డిజిటల్ స్ట్రీమింగ్..

‘ఆహా’ ఓటీటీలో రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ (Twitter/Photo)

‘ఆహా’ ఓటీటీలో రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ (Twitter/Photo)

Romantic Movie Digital Streming :  డాషింగ్ డైరెక్టర్  పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri)   ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా  నటించిన మూవీ ‘రొమాంటిక్’(Romantic). సరికొత్త కాన్సెప్ట్‌తో  లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంకా చదవండి ...
    Romantic Movie Digital Streming :  డాషింగ్ డైరెక్టర్  పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri)   ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా  నటించిన మూవీ ‘రొమాంటిక్’(Romantic). సరికొత్త కాన్సెప్ట్‌తో  లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమాను ఈ రోజు నుంచి ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.  రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి పోయి ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పోటికి మరో సినిమా విడుదలైనప్పటికి.. మరోవైపు మిక్స్‌డ్‌‌గా  వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

    ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ ముఖ్యంగా యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. మొత్తంగా రూ. 4.6 కోట్ల థియేట్రిక్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగింది.

    Romantic - Ketika Sharma : కేక పుట్టించేలా కేతిక శర్మ రొమాంటిక్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్..


    తాజాగా ఈ సినిమా థియేట్రిక్ రన్ ముగిసింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా  ఓవరాల్‌గా రూ. 4.2 కోట్ల వరకు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజిగా నిలిచింది.రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది.


    ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది.వీరితో పాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

    Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, బాబీ సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. త్వరలో అధికారిక ప్రకటన..


    ఇక ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆకాష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నారు ఆకాష్. ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నారు. చోర్ బజార్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aha OTT Platform, Akash Puri, Ketika sharma, Puri Jagannadh, Romantic Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు