Home /News /movies /

AKASH PURI KETIKA SHARAM ROMANTIC MOVIE STREMING DATE OFFICIALY ANNOUNCED TA

Akash Puri Romantic : ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. అధికారిక ప్రకటన..

‘రొమాంటిక్’ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు (Twitter/Photo)

‘రొమాంటిక్’ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు (Twitter/Photo)

Akash Puri Romantic Collections:  పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri)   ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా  నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’(Romantic). సరికొత్త కాన్సెప్ట్‌తో  లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాను త్వరలో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Akash Puri Romantic Collections:  పూరీ జగన్నాథ్ తనయుడు (Akash Puri)   ఆకాష్ పూరీ హీరోగా కొత్త హీరోయిన్ కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్‌గా  నటించిన లేటెస్ట్ లవ్ డ్రామా ‘రొమాంటిక్’(Romantic). సరికొత్త కాన్సెప్ట్‌తో  లవ్ స్టోరీ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాను త్వరలో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ సినిమాను ఈ నెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుుంది.  రొమాంటిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి పోయి ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది.

    ఈ సినిమా పోటికి మరో సినిమా విడుదలైనప్పటికి.. మరోవైపు మిక్సుడ్‌గా వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ ముఖ్యంగా యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోందని అంటున్నారు.

    Romantic - Ketika Sharma : కేక పుట్టించేలా కేతిక శర్మ రొమాంటిక్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్..


    మొత్తంగా రూ. 4.6 కోట్ల థియేట్రిక్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగింది. తాజాగా ఈ సినిమా థియేట్రిక్ రన్ ముగిసింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా  ఓవరాల్‌గా రూ. 4.2 కోట్ల వరకు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజిగా నిలిచింది.



    రొమాంటిక్.. సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది. ఆకాష్ పూరి, కేతిక శర్మతో పాటు మరో ప్రధాన పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించింది.వీరితో పాటు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు.

    Chiranjeevi - Ravi Teja : చిరంజీవి, బాబీ సినిమాలో కీలక పాత్రలో రవితేజ.. త్వరలో అధికారిక ప్రకటన..


    ఇక ఆకాష్ పూరి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆకాష్ హీరోగా ఓ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభమైంది. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నారు ఆకాష్. ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి సినిమాను నిర్మిస్తున్నారు. చోర్ బజార్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందట. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో సుబ్బరాజు, పోసాని, అర్చన కనిపించనున్నారు. చోర్ బజార్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aha OTT Platform, Akash Puri, Ketika sharma, Romantic Movie, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు