హోమ్ /వార్తలు /సినిమా /

Akash Puri: మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ.. ఆకాష్ పూరి క్లాప్

Akash Puri: మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ.. ఆకాష్ పూరి క్లాప్

Akash Puri Photo News 18

Akash Puri Photo News 18

చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరిగాయి. తొలి సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మహీంద్ర పిక్చర్స్ (Mahidra Pictures) పతాకంపై చైతన్య పసుపులేటి (Chaitanya Pasupuleti), రితిక చక్రవర్తి (Rithika Chakravarthi) జంటగా చిన్న వెంకటేష్ (Chinna Venkatesh) దర్శకత్వంలో వి. శ్రీనివాస రావ్ (V Srinivasa Rao) తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి (Akash Puri) హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి, నిర్మాత వి. రావు లు వచ్చి మమ్మల్ని బ్లేస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి.ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నందున ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుకొని హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసుకొంటామని అన్నారు.

చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా.దర్శకుడు వెంకటేష్ గారు చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా మా బ్యానర్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా వెంకటేష్ గారు నా మెదటి సినిమా నుండి తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.మంచి టీం, మంచి కథతో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ.. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్ గా నటించాను. ఆ సినిమా నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయదేవరకొండ "ఖుషి" సినిమాలో, అనంత సినిమాలలో హీరోయిన్ సినిమాలలో నటిస్తున్న నాకు సస్పెన్సు థ్రిల్లర్ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Akash Puri, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు